21న నంది, జాతీయ సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవం

Jan 7,2024 14:42 #Annamayya district

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్య) : వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తూన్న ప్రముఖులను గుర్తించి వారికి ఈ నెల 21న నంది, జాతీయ సేవారత్న పురస్కారాల ప్రధానం చేయనున్నట్లు అభిలాష హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌. సరోజనమ్మ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభిలాష హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆర్గనైజేషన్‌ 4వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఈ నెల 21న ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. సంగీతం, నత్యం, చిత్రలేఖనం, అలంకరణ, ఇంద్రజాలం, క్రీడలు, నటన, కవిత్వం, వైద్యం, వాస్తు, జాతకాలు, సామాజిక సేవలు, జానపద గీతాలు మొదలగు రంగాల్లోని వారికి మరియు కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సినిమా, టీవీ కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, రంగస్థల కళాకారులు, గాయనీ గాయకులు, సంగీత నత్య కళాకారులు, విద్య, వైద్యం, న్యాయవాద, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతర రంగాలకు చెందిన విశిష్ట వక్తులు తమ పూర్తి వివరాలతో మా అప్లికేషన్‌ ను పూరించి, మొబైల్‌ నంబర్‌ 9705313061 కు వాట్సాప్‌ ద్వారా ఈనెల 12వ తేదీలోగా పంపాలని తెలియజేశారు.

➡️