22వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 10,2024 21:06

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌  :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నిరసన కొనసాగించారు. కొనసాగిం చారు. తమను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఎర్‌ పాలసీ అమలు చేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ విద్యాశాఖలో కీలకపాత్రపోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని సిఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆపేది లేదని అన్నారు. జెఎసి నాయకులు గురువులు, శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️