24న గీతం ఎంబిఎ  ప్రవేశపరీక్ష

Mar 20,2024 23:28 #గీతం ఎంబిఎ
గీతం ఎంబిఎ 

ప్రజాశక్తి -మధురవాడ : గీతమ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్న ఎంబిఎ కోర్సులలో ప్రవేశాలకు గీతం బిజినెస్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2024 (జిబాట్‌)ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రాజా ఫణి పప్పు తెలిపారు. బుధవారం గీతంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. జిబాట్‌-2024 ప్రవేశ పరీక్షను ఈ నెల 24న దేశ వ్యాప్తంగా 80 పట్టణాలలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామన్నారు. రెండు గంటల కాలవ్యవధి గల ఈ ప్రవేశ పరీక్ష 200 మార్కులకు ఉంటుందన్నారు. ఎంబిఎలో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ సప్లైచైన్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రీసోర్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎకౌంటింగ్‌ స్పెషలైజేషన్‌లను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంబిఎ హెల్త్‌కేర్‌, హస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖలోని ఎపి మెడ్‌టెక్‌జోన్‌తో కలిసి ఈ కోర్సును రూపొందించి నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. డిగ్రీలో ఉత్తీర్ణలై, ఆసక్తి గల విద్యార్ధులు ఈ నెల 24న జరిగే జిబాట్‌-2024కు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ప్రవేశ పరీక్షలో లభించిన మార్కుల ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వూలను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు గీతం వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నిర్వహించే కోర్సులలో కేస్‌ స్టడీస్‌ ఆధారంగా విద్యార్ధుల నైపుణ్యాలను పెంచడంతో పాటు ప్రతి విద్యార్ధిపైన వ్యక్తి గత శ్రద్దను చూపుతున్నట్లు డీన్‌ ప్రొఫెసర్‌ రాజా ఫణి పప్పు తెలిపారు. విద్యార్ధులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి వెంచర్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ (విడిసి) ద్వారా కషి చేస్తున్నామన్నారు. ఎంబిఎ విద్యార్ధుల శిక్షణకు ఎనలిటిక్స్‌ ప్రయోగశాల, అలాగే నేషనల్‌ స్టాక్‌ ఎక్సెంజ్‌ మరియు బ్లూంబర్గ్‌ తో కలసి పనిచేస్తున్నామని వెల్లడిరచారు. సమావేశంలో డాక్టర్‌ వెంకటేశ్వరులు, డాక్టర్‌.బంగారరాజు, ప్రొఫెసర్‌ పి.షీలా, జగదీష్‌, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️