25న రాష్ట్రస్థాయి పాటల పోటీలు

Dec 11,2023 16:33
విజయవంతం చేయడానికి

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 25న సూర్యకళా మందిర్‌లో ఘంటసాల జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు తెలిపారు. వేదిక అధ్యక్షులు కర్రి అచ్చుత రామారెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక పెన్షనేర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌ వద్ద పాలక మండలి సభ్యులు, ఘంటసాల కళా పీఠం సభ్యులతో సమావేశం జరిగింది. దయానందబాబు మాట్లాడుతూ 25వ తేదీన సంస్థ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. సంస్థలో సభ్యుల నమోదు, సంస్థ భవన నిర్మాణానికి స్థల సేకరణ, సంస్థ చేపట్టిన సర్‌ అర్థర్‌ కాటన్‌ దొర విగ్రహ ప్రతిష్టాపన అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు కర్రి భామిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌వివిఎస్‌ఎన్‌.మూర్తి, సభ్యులు కె.సత్యమూర్తి, మార్ని జానకి రామ చౌదరి మాట్లాడుతూ ఈ పోటీలను విజయవంతం చేయడానికి అవసరమైన సలహాలను ఇచ్చారు. సభ్యులు టివివిఎస్‌ఎన్‌.రెడ్డి, ఎస్‌వి.రమణ, కరకా రాజబాబు, ఎం.రామకృష్ణ, పి.వెంకటేశ్వర రావు, ఎన్‌.కృష్ణకాంత్‌, పి.శ్రీనివాస్‌, సిహెచ్‌.కృష్ణవేణి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️