దహన ఖర్చులకు రూ.25వేలు

May 16,2024 20:26

ప్రజాశక్తి- మక్కువ:  వైకెపి కార్యాల యంలో పనిచేస్తున్న గురునాయుడుపేటకు చెందిన ఐ అప్పలరాజు మృతి చెందడంతో ఆయన దహన ఖర్చులు నిమిత్తం కుటుంబానికి గురువారం ప్రాజెక్టు నుంచి రూ. 25వేలు అందజేశారు. ఇవి కాకుండా ఆయన కుటుంబానికి మన్యం జిల్లా వెలుగు సిబ్బంది సొంతంగా మరో రూ. 74,100 నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంలు అప్పారావు, ప్రవీణ్‌, ఎపిఎంలు సన్నిబాబు, నీలం నాయుడు, జయకుమార్‌, వెంకట్‌ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుబూతిని తెలిపారు.

➡️