250 మందికి కంటి పరీక్షలు

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కోయనాగయ్య జ్ఞాపకార్థం పెదకాకాని శంకర్‌ కంటి ఆసుపత్రి సహాకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శంకర్‌ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ హారికా, డాక్టర్‌ మెహాబూబ్‌ లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అవసరమైనవారికి కళ్ళజోళ్ళు అందచేశారు. సుమారు 250 మందికి కంటి పరీక్షలు చేశారు. 135 మం దికి శుక్లాలు వున్నట్లు గుర్తించి ఆపరేషన్‌ కోసం శంకర్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో కోయ కష్ణ, సుబ్బారావు, పాండురంగారావు, హనుమంతరావు, యర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️