26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి – సాలూరు : తమ సమ స్యలను పరిష్కరిం చాలని కోరుతూ మున్సి పల్‌ కార్మికులు ఈనెల 26 నుంచి సమ్మెకు దిగ నున్నారు. ఈ మేరకు గురువారం మున్సి పల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, పట్టణ నాయకులు టి.శంకర్‌, మహిళా కన్వీనర్‌ టి.ఇందు ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికులు మేనేజర్‌ రాఘవాచార్యులకు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ఠ్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని చెప్పారు. నాలుగేళ్లలో ఒక్క సమస్యను పరిష్కరించలేదని చెప్పారు. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.పాలకొండ : మున్సిపాల్టీల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈనెల 26 నుండి నిరవధిక సమ్మెకు కాంట్రాక్ట్‌ కార్మికులంతా వెళ్లాల్సి వస్తుందని, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సభ్యులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పంచాయతీ మస్తరు పాయింట్లో కార్మికులతో మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, మున్సిపాల్టీల్లో వచ్చే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పడాల భాస్కరరావు, సిహెచ్‌ సంజీవి, సురేష్‌, పడాల వేణు, వండాన ఆంజనేయులు, విమల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️