30న మహా ధర్నా.. సన్నాహక సమావేశం

 పల్నాడు జిల్లా : మున్సిపల్‌ ఉపాధ్యాయుల అపరిష్కత సమస్యలు పరిష్కార సాధనకై యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి ప్రేమ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యా లయంలో ఉపాధ్యాయులతో జయప్రదం మహా ధర్నా జయప్రదంకై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్‌ ఉపాధ్యాయుల జిల్లా సదస్సుకు మున్సిపల్‌ సబ్‌ కమిటీ కో కన్వీనర్‌ కె.తిరుపతిస్వామి అధ్యక్షత వహించారు. ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టక పోవడం అన్యాయ మన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల పిఎఫ్‌ ఖాతాలు వెంటనే తెరిచి మున్సిపల్‌ పాఠశాలలోని ఉపాధ్యాయుల పోస్టులు అప్గ్రేట్‌ చేయాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందిని నియమించకుండా పాఠ్యాంశాలను ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల ద్వారా లభించిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌర వాధ్యక్షులు కె. శ్రీనివాస రెడ్డి, జిల్లా కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, నరసరావుపేట మున్సిపల్‌ శాఖ బాధ్యులు కె. వెంకటేశ్వర్లు, ఓ కోటేశ్వరరావు, జి ఆంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్‌ కె.అరుణ ,షేక్‌. మల్లికా బేగం, కార్మెల్‌ మేరీ ,అకిబ్‌, సాంబయ్య, కె. ఉషాసౌరీరాణి పాల్గొన్నారు.

➡️