30 రోజులుగా రోడ్లపైనే…

Jan 11,2024 00:07
అంగన్‌వాడీలు చేపట్టిన

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్‌వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరింది. గత 30 రోజులుగా అవిశ్రాంతంగా రోడ్లపైనే తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీల ద్వారా తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అయినా రాష్ట్ర సర్కార్‌కు ఏమాత్రం చలనం లేకుండా పోయింది. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణిచివేసేందుకు సిద్ధం అయ్యారు. కనీస వేతన చట్టానికి నోచుకోని అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉద్యోగులపై ప్రయోగించే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరహారదీక్ష పేరుతో రాత్రి పగలు తేడా లేకుండా జిల్లా కేంద్రాల్లో అంగన్‌వాడీలు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని అంగన్‌ వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిం చడాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు స్వచ్చంధంగా అరెస్టులు అయ్యారు. అయినా జగన్‌ సర్కార్‌ మాత్రం దున్నపోతుపై వర్షం కురిసిన చందంగానే వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యం లోనే ఎస్మా చట్టాన్ని ప్రయోగిం చడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీలు దేశవ్యాప్తంగా ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. కాకినాడ స్థానిక కలక్టరేట్‌ వద్ద మొదలు పెట్టిన 24 గంటల రిలే దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ సంద ర్భంగా ప్రత్తిపాడు, శంఖవరం అంగన్‌వాడీ ప్రాజె క్టుల నాయకులు అల్లాడి లక్ష్మీ, కాకరపల్లి సునీత, గెడ్డం బుల్లమ్మలతోపాటు, కానూరి హేమ లత, టి.నాగసత్యవతి, ఎన్‌.అమ లావతి, పి.గంగభవానీ, బి.ఉదయ గంగ, బి.రత్నకుమారి, బి.సత్యవేణి దీక్షను చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సుప్రీంకోర్టు మీద సిఎం జగన్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అంగన్‌ వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగాకనీస వేత నాలు చెల్లించమంటే అంగన్‌వాడీ లపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. అవసరమైతే మరో 30 రోజులు సమ్మె చేయ డానికైనా తాము సిద్ధంగా ఉన్నా మని, డిమాండ్లు సాధించుకునేంత వరకూ వెనకడుగు వేయమని అన్నారు. 4వ రోజు రిలే నిరాహార దీక్షలకు 108 సర్వీసెస్‌ కాంట్రాక్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణ, జిల్లా కమిటీ సభ్యుడు వి.తాతబ్బాయి, నగేష్‌, టెక్నీషియన్స్‌ నీలకంఠ, అబ్దుల్లా, గణేష్‌, శ్రీనివాస్‌, నూకరాజు, కాకి నాడ టాటా మోటార్స్‌ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వాలిశెట్టి శ్రీను, పి.రాజా రమేష్‌, చక్రధర్‌, రాంబాబు, సురేష్‌, వరాలు, సాయి, రాఘవ, కొప్పిశెట్టి సత్తిబాబు, పంచాయితీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు పోచపల్లి రమణ, ఎపి బిల్డింగ్‌ అండ్‌ ఆదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, సిఐటియూ సీనియర్‌ నాయకులు మెడిశెట్టి వెంకట రమణ, టిఎన్‌టియుసి జోన్‌ 2 కార్యదర్శి సత్య ప్రసాదరావు మద్దతుగా మాట్లాడారు. పిఠాపురం తమ సమస్యలు పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా పిఠాపురం, గొల్ల ప్రోలు తహశీల్ధార్‌ కార్యాలయాల వద్ద సమ్మె శిబిరాల్లో నిరసనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.చిన్నా, యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మి, విజయశాంతి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పద్మ, అమల, నళిని, ప్రజావాణి, బేబీ, సూర్యకాంతం, సరోజినీ, చంద్రలీల, పుష్పరత్నం తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు స్థానికంగా నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు ఒంటికాలిపై నిలబడి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు జోడిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, షకీలా భాను, కుమారి, లలిత కుమారి, మనీ, రాజకుమారి, శ్రీదివ్య, దుర్గ భవాని తదితరులు పాల్గొన్నారు.జగ్గంపేట రూరల్‌ స్థానిక పంచాయతీ రాజ్‌ అతిథి గృహం వద్ద జరుగుతున్న సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలు నిరసనను కొనసాగించారు. ఉద్యమం ప్రారంభించి 30 రోజులు కావడంతో 30వ సంఖ్యలో కూర్చు ని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో యూనియన్‌ నాయకులు సుజాత, రాజేశ్వరి, రామ్‌ లీలా, అనంతలక్ష్మి, గంగాభవాని, తదిత రులు నాయకత్వం వహించారు. కరప స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన కార్యక్రమం జరిగింది. అంగన్‌వాడీ ప్రాజెక్టు నాయకురాలు పి వీరవేణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవ కుమారి, అచ్చారత్నం, కల్పలత, హెల్పర్‌ సత్యా మాధవి, ఎం.భవాని, నారాయణమ్మ, మంగతాయారు, సరోజినీ, జ్యోతి, కల్పలత, పి.లక్ష్మి, ఎ.దేవి, బి.మనోజ, లక్ష్మి, సాయిదుర్గ, బి.భవాని, తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన కొనసాగింది. సమ్మె 30వ రోజుకు చేరుకున్న సందర్భంగా 30 వ అంకె ఆకారంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, పద్మజ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️