కనీసవేతనం 26వేలు చెల్లించాలని ఆశాల 36గంటల నిరసన

Dec 11,2023 15:46 #Kakinada

ప్రజాశక్తి కాకినాడ : ఆశా కార్యకర్తల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద 36గంటల నిరసన డిసెంబర్ 14,15 తేదీలలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసిన ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని, ఆన్లైన్ వర్క్ పేరుతో వేధింపులు ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఆశ వర్కర్లకు అమలు చేయాలని, విధి నిర్వహణలో చనిపోయిన ఆశవర్కర్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల న్యాయమైన పోరాటానికి కాకినాడ జిల్లా ప్రజలు సహకరించి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భారతి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి, పచ్చిపాల గమ్య, దండుప్రోలు జ్యోతి, తలుపులమ్మ దేవి, భవాని, కుమారి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

➡️