4వ రోజుకు అంగన్వాడీల సమ్మె

4వ రోజుకు అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది.  జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. వీరికి టిడిపి, జనసేన పార్టీ, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయిరాజమహేంద్రవరం అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతుగా ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అంగన్వాడీల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్‌, అద్యక్షుడు జి.రాంబాబు, సంయుక్త కార్యదర్శి మాథ్యూస్‌, జోనల్‌ అధ్యక్షుడు పి.సతీష్‌ పాల్గొన్నారు. చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో సిపిఎం మండల కార్యదర్శి కెకె.దుర్గారావు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.ఆదం మాట్లాడారు. అంగన్వాడీలు గ్రామంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. జనసేన నాయకులు గాయత్రి వెంకటేశ్వరరావు, ఉప్పులూరు బాబ్జి, శెట్టి సుభాషిణి, కొప్పాక విజరు కుమార్‌, శీతల్‌, ఉప్పులూరు చిరంజీవి మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పి.విజరు కుమారి, కె.లక్ష్మి, కె.దమయంతి, బి.మహాలక్ష్మి, ఎ.శ్రీదేవి, ఎస్‌.అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. తాళ్లపూడి టిడిపి, జనసేన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నామన పరమేశ్వర రావు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు, గంటా కృష్ణ పాల్గొన్నారు. ఉండ్రాజవరం అంగన్వాడీలు నలుపు రంగు చీరలు ధరించి, సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. ఎస్‌.రంగనాయకమ్మ, కె.లకీëకుమారి, ఎం.జానకి, కెఎన్‌ఎస్‌.ప్రసన్నకుమారి, సిహెచ్‌.జ్యోతి, ఎంవి.నరసమ్మ, జి.సువర్ణలత, ఉషారాణి, పి.గిరిజ, నిర్మల, కె విజయ కుమారి, కె.వరలక్ష్మి పాల్గొన్నారు. నల్లజర్ల సిఐటియు నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు, ఎస్‌కె.భగత్‌, పశ్చిమ గోదావరి మాజీ జెడ్‌పి ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. యూనియన్‌ నాయకులు కె.విమలబారు, ఎస్‌.శివకుమారి, ఝాన్సీలక్ష్మి, ఐ.రామలక్ష్మి, నాగమణి, రాజేశ్వరి, పి.జగదీశ్వరి, బేబీ, దుర్గంబికా, ధనలక్ష్మి, ఎం.మల్లమ్మ, యం.మాలతి, వెంకటరత్నం పాల్గొన్నారు. కడియం తహశీల్దార్‌ కార్యాలయం అంగన్వాడీలు నలుపు చీరలు ధరించి నిరసన తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్‌, వైస్‌ ఎంపిపి పంతం గణపతి, వెలుగుబంటి నాని, ముద్రగడ జెమ్మి, బోడపాటి రాజేశ్వరి, రత్నం, అయ్యప్ప అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపారు. గోపాలపురం అంగన్వాడీల దీక్షకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు సంఘీభావం తెలిపారు. రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోకవరం తహశీల్దారు కార్యాలయం వద్ద సుమారు వందమంది అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌్‌ పాల్గొన్నారు.

➡️