మాచర్ల్ల : రాష్ట్రంలో అవ్వాతాతలకు జగన ్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంవూర్ణ అండగా ఉందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అన్నారు. స్థానిక మండల కార్యాలయంలో నూతనంగా పెంచిన పింఛన్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిóగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ భారతదేశంలోనే అత్యధిక పెన్షన్స్‌ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని వివరించారు. కార్యక్రమంలో నాయకులు తాడి వెంకటేశ్వరరెడ్డి, బూడిద శ్రీనివాస రావు తదితరులు పాల్గోన్నారు.

 అమరావతి:  ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ పెంచిన పెన్షన్లతో ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా రూ.3 వేలకు పెంచిన పెన్షన్లను అమరావతిలో పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే, పెరిగిన పెన్ష న్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరావతి మండలంలో 2019 నాటికి 7780 మందికి రూ.77.8 లక్షలు మాత్రమే వచ్చేవని.. ఇప్పుడు 10296 మందికి రూ.3.07 కోట్లు అందుతున్నాయన్నారు. అమరావతి గ్రామంలో 2019లో 1084 మందికి కేవలం రరూ.10.84 లక్షలు మాత్రమే పెన్షన్లు అందేవని.. ఇప్పుడు 1562 మందికి రూ.49.26 లక్షలు అందుతున్నాయన్నారు. నాదెండ్ల మండలంలో పెన్షన్‌ కానుక పంపిణీలో వైసిపి నియోజకవర్గ సమ న్వయకర్త మల్లెల రాజేష్‌ నాయుడు పాల్గొ న్నారు. నాదెండ్ల మండల పరిషత్‌ కార్యా లయంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. మల్లెల రాజేష్‌ నాయుడు మాట్లా డుతూ మండలంలో 9,800 మందికి 2 కోట్ల 44 లక్షలు ప్రతినెల పింఛన్ల కింద ఇవ్వడం జరుగుతోందన్నారు. మండలంలో కొత్తగా 170 పెన్షన్లు మంజూరైనట్లు చెప్పారు. ఎంపీపీ తల తోటి రాణి, జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్‌ రావు, వైఎస్‌ఆర్‌ సీపీ మండల అధ్యక్షులు మద్దూరి కోటిరెడ్డి, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ అల్లడి రవికుమార్‌, ఎంపీడీవో జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.  చిలకలూరిపేట:   మున్సిపాల్‌ కార్యా లయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వ యకర్త మల్లెల రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి నెలా 11,424 మందికి రూ.3.45 కోట్లు, మండలంలో 8,568 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. పట ్టణంలో 150 మందికి కొత్త పెన్షన్లు మంజూ రైనట్లు చెప్పారు. మునిసిపల్‌ చైర్మన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొలిశెట్టి శ్రీనివాసరావు, చిలకలూరిపేట ఎంపిడిఒ, మునిసిపల్‌ అధికారులు, ఎంపిపి దేవినేని శంకరరావు, జడ్పిటిసి కోడె సుధారాణి, కొమరవల్లిపాడు సొసైటీ అధ్యక్షులు కొండవీటి ఆంజనేయులు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్‌ తలహాఖాన్‌, పట్టణ మాజీ అధ్యక్షులు ఎవిఎం సుభాని పాల్గొన్నారు.

➡️