పిడుగు పడి ఇద్దరికి గాయాలు – 50 మేకలు మృతి

May 6,2024 00:41

ప్రజాశక్తి-దుర్గి : ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడగా, 50 మేకలు మృతి చెందాయి. దుర్గి మండలంలోని కాకిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాకిరాల కి చెందిన రాముడు, కొంగ లక్ష్మీనా రాయణ, బూతూరి లక్ష్మయ్య అనే ముగ్గురు వ్యక్తులు మేకలు మేపుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతోపాటు పిడుగు పడటంతో లక్ష్మీనారాయణ,లక్ష్మయ్యలు గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నరసరావుపేటకు రిఫర్‌ చేశారు.

➡️