Jan 17,2024 15:46 #anathapuram, #Anganwadi strike

ప్రజాశక్తి-అనంతపురం : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు అంగన్వాడీ కార్మికులకు అండగా ఉంటాం ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పేర్కొన్నారు. అంగన్వాడి కార్మికులు తలపెట్టిన నిరవధిక ఆమరణ నిరాహార దీక్షకు సిపిఎం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం అన్ని ప్రజాసంఘాల మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వారి డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దన్న, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, అంగన్వాడి కార్మికులు పాల్గొన్నారు.

➡️