8న చలో విజయవాడ

Feb 2,2024 20:33

 ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 8న ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆశా కార్యకర్తలు శుక్రవారం స్థానిక సిహెచ్‌సి వైద్యులు సంతోష్‌ కుమారికి వినతి పత్రాన్ని అందించారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్‌ను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్యాలు కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు లంక శాంతమ్మ తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవ్‌, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌, అమలు చేయాలని సంబంధం లేని పనులు చేయించరాదని, నాణ్యమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని 62 సంవత్సరాల రిటైర్మెంట్‌ జీఓని వర్తింపజేయాలని కోరుతూ ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️