9లోపు కొత్త ఓట్లను నమోదు చేసుకోవచ్చు

Dec 9,2023 00:36

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 9వ తేదీలోపు కొత్తగా ఓట్లను నమోదు చేసుకోవచ్చని మండల తహశీల్దారు పి మధుసూదనరావు తెలి పారు. స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీలోపు అర్హులైనవారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు నమోదు చేసుకోని వారికి జనవరి 5వ తేదీన మరలా ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తారని ఆయన తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పించేలా బిఎల్‌ఓలు చూడాలని సూచించారు. ఓటరు జాబితాలలో మరణించిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బిఎల్‌ఓలకు సూచించారు. ఓటర్ల విచారణ పక్కాగా నిర్వహించాలని ఆయన కోరారు. ఓటుకు ఆధార్‌ నంబరును లింక్‌ చేయకపోతే ఓటును తొలగించరని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు ఎం హరిబాబు, సిపిఎం మండల నాయకులు నెరుసుల వెంకటేశ్వర్లు, వైసీపీ మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డి, నూకతోటి ఈశ్వరరావు, కత్తినేని శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్‌ నాయకులు దుంపా యలమందరెడ్డి, బిజెపి నాయకుడు టి శ్రీనివాసరావు, డీటి శాంతికుమారి పాల్గొన్నారు.

➡️