9 నెలల జీతాల కోసం అర్ధనగ ప్రదర్శన

Mar 18,2024 23:48

ఫిరంగిపురంలోని సమ్మె శిబిరంలో అర్ధనగ ప్రదర్శనలో నిరసన తెలుపుతున్న కార్మికులు
ప్రజాశక్తి – ఫిరంగిపురం, పెదకాకాని :
తమకు 9 నెలల జీతం బకాయిలు చెల్లించాలని కోరుతూ మండల కేంద్రమైన ఫిరంగిపురంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఆందోళనలో భాగంగా కార్మికులు అర్ధనగ ప్రదర్శనలతో నిరసన తెలిపారు. యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ఇబ్రహీం సిహెచ్‌ రామారావు, బాలస్వామి, శ్రావణ్‌, మస్తాన్‌వలి, ప్రభుదాస్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కార్మికుల ఆందోళనకు మద్దతుగా మండల కేంద్రమైన పెదకాకా నిలోని పంచాయతీ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.శి వాజీ మాట్లాడుతూ నెలల తరబడి కార్మికు లకు జీతాలివ్వకుంటే వారేమి తిని బతకాలని ప్రశ్నించారు. వారికి సత్వరమే జీతాలు చెల్లించాలని, సబ్బులు, నూనె, యూనిఫామ్‌, మాస్కులు, గ్లౌజులు, చెప్పులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టెండర్లు ప్రతిపాదన పంపాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో రాజా, రమేష్‌, కార్మికులు పాల్గొన్నారు.

➡️