9 నామినేషన్లు తిరస్కరణ:  రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌

మాచర్ల :  మే 13న మాచర్ల అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో పోటి చేసేందుకు అందిన నామినేషన్స్‌లో స్కూృటీని అనంతరం టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ తదితర ప్రధాన పార్టీల అభ్యర్ధులతో కలిపి మొత్తం 15 నామినేషన్లు ఆమోదం పొందినట్లు రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మనందరెడ్డి, వైసిపి పార్టీ అభ్యర్ధి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డాక్టరు యరమల రామచంద్రారెడ్డి తదితర 15 నామినేషన్లు ఆమోదం పొందినట్లు వివరించారు. 9 నామినేషన్స్‌ను నిబంధనల మేరకు తిరస్కరించినట్లు తెలిపారు. శనివారం నుండి ఈ నెల 29వ తేదిలోపు పోటి నుండి విరమించుకునే వారు విత్‌డ్రా చేసుకోవచ్చునని తెలిపారు.

➡️