ఆటా ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో బిజినెస్‌ సెమినార్‌

Dec 20,2023 10:10 #Business, #Seminar, #visaka

ప్రజాశక్తి, ఎంవిపి (విశాఖ) : ఆంధ్రప్రదేశ్‌ లో గల వైజాగ్‌, ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆటా వేడుకల్లో భాగంగా … ఆంధ్రా యూనివర్సిటీ, ఏపి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లు ఆటా తో కలిసి సంయుక్తంగా బిజినెస్‌ సెమినార్‌ ని ఆంధ్ర యూనివర్సిటీలోని వై వి ఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హాజరై మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కంపెనీలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. నూతనంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు భూమి, విద్యుత్‌, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఆటా ఆధ్వర్యంలో ఇలాంటి బిజినెస్‌ సెమినార్‌ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారు కూడా మన రాష్ట్ర అభివఅద్ధికి తోడ్పాటు అందిచాలని కోరారు. అనంతరం ఎపి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుండి ప్రెసిడెంట్‌ భాస్కర్‌ రావు పొట్లూరి, మాజీ ప్రెసిడెంట్‌ సాంబశివరావు, లీ ఫార్మా ఎండీ లీలా రాణి తదితరులు పాల్గని ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పోర్ట్‌ బేస్డ్‌ ఎకానమీ, ఫార్మాస్యూటికల్‌, మహిళా సాధికారత వంటి అంశాల గురించి చర్చించారు. అలాగే ఏపీలో ఐటీ ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్‌ సెక్టార్‌, ఎన్‌అర్‌ఐ వ్యాపార యజమానుల ప్రతినిధులు మౌలిక సదుపాయాలు, వర్క్‌ఫోర్స్‌ లభ్యత, ప్రోత్సాహకాల ఆధారంగా కంపెనీలను ఏపీకి తరలించాలని వారు కోరారు. ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్వతోముఖాభివఅద్ధికి ఆటా తప్పకుండా సహకారం అందిస్తుంది అన్నారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు. ఈ బిజినెస్‌ సెమినార్‌ కు సహకరించిన ఆంధ్ర యూనివర్సిటీ, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశం లో కోఆర్డినేటర్స్‌ శ్రీధర్‌, తిరుపతి, కాన్ఫరెన్‌ కన్వీనర్‌ కిరణ్‌ పశం, బిజినెస్‌ కో చైర్స్‌ లక్ష చేపూరి, హరీష్‌ బత్తిని, ట్రస్టీస్‌ నర్సిరెడ్డి గడ్డికోప్పుల,కిషోర్‌ గూడూరు, ఆటా బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ రమేష్‌ అన్నంరెడ్డి,తిరు చైళ్లపల్లి, ఇందు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️