చట్టాలు పట్ల అవగాహన ఉండాలి : జడ్జి లక్ష్మీరాజ్యం

Jun 29,2024 17:15 #awareness, #Judge Lakshmirajyam, #laws

ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్‌) : చట్టాలు పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని నందిగామ సీనియర్‌ కోర్టు సివిల్‌ జడ్జి వి. లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నందిగామలో జరిగింది. నందిగామ సీనియర్‌ కోర్టు సివిల్‌ జడ్జి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపుల్‌ జూనియర్‌ ముఖ్య అతిథులుగా పాల్గన్నారు. జడ్జిలు మాట్లాడుతూ … లోక్‌ అదాలత్‌ వల్ల ప్రశాంత వాతావరణంలో ఇరు వర్గాలవారు రాజీ చేసుకుంటే సమయం, ఖర్చులు ఆదా అవుతుందన్నారు. ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని జడ్జీలు అన్నారు. నందిగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, జాయింట్‌ సెక్రెటరి ఎక్కిరాల హనుమంతరావు, జిల్లా కోర్టు గవర్నమెంట్‌ లీడర్‌ దర్శి అర్జున్‌, మాజీ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మన్నెం.నారాయణరావు, బండి మల్లికార్జునరావు, మాజీ ఎజిపి బందలపాటి రామకఅష్ణ, షేక్‌ సైదా, కొమ్మినేని మౌళేశ్వరరావు, మండల న్యాయ సేవాధికారి సంస్థ క్లర్క్‌ శివాని, తదితర సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️