వివాహిత అనుమానాస్పద మృతి

Mar 2,2024 15:15 #East Godavari, #women death

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : నల్లజర్ల మండలం జగన్నాధపురం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తానెం విష్ణు, భార్య లక్ష్మి కొద్ది కాలంగా నల్లజర్లలో నివాసం ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి లక్ష్మి ఉరి వేసుకుని చనిపోయినట్లు భర్త విష్ణు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా లక్ష్మి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. భర్త విష్ణు కొట్టడంతోనే చనిపోయి ఉంటుందని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

➡️