సారాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

May 23,2024 14:42 #East Godavari, #sara case

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : అక్రమంగా నాటు సారా రవాణా చేస్తున్న వ్యక్తిని మాధవరాయుడు పాలెం గ్రామ శివారు చైతన్యనగర్‌ రైల్వే గేట్‌ వద్ద కడియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ బి.తులసీదర్‌, ఎస్‌ టి.కృష్ణ సాయి మాట్లాడుతూ.. కొప్పిశెట్టి రామకష్ణ (39) అక్రమంగా నాటు సారా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 100 లీటర్ల నాటు సారా, మోటార్‌ సైకిల్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కడియం మండలం పరిధిలో ఎవరైనా కోడిపందాలు, పేకాటలు, సారాయి, మద్యం అమ్మకాలు, సారాయి తయారు చేసిన, అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️