ప్రత్యేక అవసరాల బాలల సర్వే పరిశీలన

May 7,2024 15:16 #Kakinada

ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం మండల పరిధిలో ప్రత్యేక అవసరాల బాలల గుర్తింపు,అంగన్వాడి కేంద్రాలలో 6 సంవత్సరాలు నిండిన బాలల సమాచార సేకరణ నిమిత్తం నిర్వహిస్తున్న సర్వేను మంగళవారం కాకినాడ జిల్లా సహిత విద్య కో-ఆర్డినేటర్,సీఎం ఓ చామంతి నాగేశ్వరరావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మంగళవారపుపేట లో ఐ ఈ ఆర్ పి లు నిర్వహిస్తున్న సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు సదరం సర్టిఫికెట్స్ వచ్చే విధంగా చూడాలన్నారు.మాటలు రాని పిల్లలను భవిత సెంటర్ కు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులలో అవగాహన పెంచాలన్నారు.వారికి స్పీచ్ తెరపి ఇవ్వాలన్నారు.ప్రతి మంగళవారం సమగ్ర శిక్షా ద్వారా ఉచితంగా అందిస్తున్న ఫిజియోథెరపీ పై అవగాహన పెంచాలని సూచించారు.ఆరు సంవత్సరాల వయసు నిండిన బాలలను 2024-25 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించే సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఐ ఈ ఆర్ పి,అంగన్ వాడి టీచర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భవిత సిబ్బంది పాల్గొన్నారు.

➡️