ఎమ్మెల్యే బోనెలకు ఘన స్వాగతం

Jun 14,2024 21:26

 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బోనెల విజరు చంద్రకు శుక్రవారం తన స్వగ్రామం నర్సిపురంలో ఘన స్వాగతం లభించింది. మాజీ వైస్‌ ఎంపిపి గొట్టాపు గౌరీ వెంకటరమణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. స్వాగత ఫ్లెక్సీలతో యువత గ్రామమంతా నింపేశారు. గ్రామంలోని శివాలయంలో హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సీతానగరం: పార్వతీపురం ఎమ్మెల్యేగా బోనెల విజయచంద్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హనుమాన్‌ జంక్షన్‌లో ఆంజనేయ కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పార్వతీపురం బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేకు అప్పయ్యపేట, మరిపువలసలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు పెంట సత్యంనాయుడు, వేణుగోపాలనాయుడు, టి.వెంకటఅప్పలనాయుడు, సాలహరి గోపాలరావు, కె.అరవింద్‌కుమార్‌, కొట్నాల రామకృష్ణ, గుంపు స్వామితో పాటు జనసేన, బిజెపి నాయకులు స్వాగతం పలికారు.

➡️