గెలుపా – ఓటమా ? : శింగనమలలోని అభ్యర్థుల్లో ధీమా-నైరాస్యం..!

Apr 29,2024 15:01 #candidates, #lose, #Shinganamala, #win

ప్రజాశక్తి, నార్పల (అనంతపురం) : శింగనమల నియోజకవర్గంలో విభిన్న పరిస్థితి…. విజయ ధీమా లో ఒకరు, ఓటమి నైరాస్యంలో మరొకరు….. సర్వేలపై అతివిశ్వాసంతో ఒకరు అపనమ్మకంలో మరొకరు…. అందరికీ అభయ హస్తమే కానీ పైసా బయటకు తీయని అభ్యర్థులు…ఆందోళనలో ఇరుపార్టీల కార్యకర్తలు….

శింగనమల నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న పరిస్థితి ఏర్పడింది ఈ ఎన్నికల్లో వైసిపి, అభ్యర్థి, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి-టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీలో నిలిచారు. మొత్తానికి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో ప్రధానంగా వైసిపి, టిడిపి మధ్యన నువ్వా నేనా అన్న విధంగా గట్టి పోటీ సాగుతోంది అయితే ఇరు పార్టీల అభ్యర్థులు సర్వేలపై ఒకరు అతి విశ్వాసంతో విజయం మనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా మరొకరు సర్వేలు తమకు అనుకూలంగా రాలేదు ఓటమి తప్పదు అని నిరాశలో ఉన్నారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకుల ప్రోత్బలంతో నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు కానీ ఎలాగూ గెలుస్తాము అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలన్న విధంగా ఒక అభ్యర్థి ఎలాగూ తాము ఓడిపోతాము కదా అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అన్న మీమాంసలో మరో అభ్యర్థి ఉన్నట్లు ప్రస్తుతం సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు అంటూ ఇండియా కూటమి అభ్యర్థి సింగనమల్ల నియోజకవర్గంలో రెండు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్‌ తన హయాంలో సింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివఅద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో శైలజానాథ్‌ దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో ఎన్ని సర్వేలు చేసినా తుది తీర్పు మాత్రం ప్రజలదేనని ఎన్ని సర్వేలు చేసినా ప్రజల అంతరంగాన్ని తెలుసుకోవడం ఎవరి చేత కాదని రాజకీయాలలో అతి నమ్మకం అపనమ్మకం పనికిరావని ఏమైనా జరగవచ్చునని ఏమో గుర్రం ఎగరాను వచ్చునని గెలుస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు ఓడిపోవచ్చు. ఓడిపోతామన్న నిరాశలో ఉన్న అభ్యర్థులు గెలవచ్చు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని గొప్ప, గొప్ప మహా నాయకులే ప్రజల నాడిని పూర్తిగా తెలుసుకోలేక ఓటమిపాలైన సంఘటనలు దేశంలో కో కొల్లలు. దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ, తెలుగు రాష్ట్ర ప్రజల హఅదయాల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌.టి.రామారావు లాంటి మహా మహానీయులకే ఓటమి తప్పలేదని. సింగనమల్ల నియోజకవర్గంలో ప్రస్తుతం బరిలో ఉన్న ఇరు పార్టీల అభ్యర్థులు వారంతటవారే జయ అపజయాలపై అంచనా వేసుకుని ప్రచారాలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ పైసా రాల్చడం లేదంటూ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోనే సెంటిమెంట్‌ నియోజకవర్గంగా పేరు ఉన్న సింగనమల నియోజకవర్గం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో జూన్‌ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే అంటూ పలువురు పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

➡️