వైసిపితోనే అభ్యున్నతి : రాజన్నదొర

May 7,2024 22:00

 ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని, మళ్లీ రాష్ట్ర అభ్యున్నతి జరగాలంటే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని నంద, మార్కొండపుట్టి తన సొంత పంచాయతీలో మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం వైసిపి మండల నాయకులు ఎం.రంగునాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదగైశీలలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసిపి అధికారంలోకి తీసుకురావాలని, అందులో భాగంగా వైసిపి అభ్యర్థిగా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఎం.శ్రీనివాసరావు, స్థానిక వైసిపి నాయకులు వి.శ్రీనివాసరావు, టి.శ్రీరాములు, బి.అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: మండలంలోని పెదపదం, పాలికవలసలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి ఇంటింటికీ తిరిగి జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాజన్నదొరను మరోసారి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర ,ఎంపీ అభ్యర్థి తనూజా రాణి ని ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పద్మావతి కోరారు.ఆమెతో పాటు వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, సర్పంచ్‌ రెడ్డి సుకన్య వున్నారు.

➡️