ఏడి’పింఛన్‌’

ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌/ మైదుకూరు/ దువ్వూరు ఎన్నికల కోడ్‌ పెన్షన్‌ దారులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏప్రిల్‌లో ప్రభుత్వమే సచివాలయ, పంచాయతీ కార్య దర్శులతో పంపిణీ చేసింది. ఈ నెలలో నేరుగా పింఛనుదారుల ఖాతాలో వేయ డంతో వృద్ధులు, వికలాంగులు, వితం తవులు నానా అవస్థలు పడు తున్నారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో వృద్ధు లు, వికలాంగులు బ్యాం కుల వద్ద ఎండలో పింఛన్‌ కోసం క్యూకట్టాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకు అకౌంట్‌ ఉన్న పింఛన్‌ దారులకు నేరుగా ప్రభుత్వం పంచాయితీ రాజ్‌ శాఖ ద్వారా బ్యాంక్‌కు బదలాయించారు. అకౌంట్‌ లేని వారికి నేరుగా ఇంటివద్దకు వచ్చి సచివాలయం ఉద్యోగులు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త చిక్కు ఏమిటంటే అకౌంట్‌లో పింఛన్‌ డబ్బులు వేయడం వల్ల వద్ధులు, వికలాంగులు, వితంతువులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు పింఛన్‌ డబ్బుల కోసం పట్టణంలోని బ్యాంకుల వద్దకు ఆటోలు, బస్సులలో ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. సరాసరి రూ. 50 నుంచి రూ. 100 ఇచ్చి పోగొట్టు కుంటున్నారు. గ్రామాలలో రూ. వెయ్యి, రూ.10 చొప్పున రూ.30 కమీషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. గత నెల మాదిరే పింఛన్‌ ఇంటి వద్ద వచ్చి ఇస్తే ఈ కష్టలు పడేవారం కామని పింఛన్‌దారులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద కనీసం కూర్చోవడానికి స్థలం లేక ఎండకు రోడ్డు వెంబడి నీడ ఉన్నచోట తలదాచుకున్న పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల అయినా సచివాలయం వద్దనే పింఛన్‌ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. . మైదుకూరు : సామాజిక భద్రత పెన్షన్ల దారులకు మే నెల పెన్షన్‌ డబ్బులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ంనేరుగా పెన్షన్‌ దారుల అకౌంట్లకు జమ చేసింది. మైదుకూరు పట్టణంలో గురువారం కూడా బ్యాంకుల వద్ద పెన్షన్‌ దారులు డబ్బుల కోసం పడిగాపులు కాశారు. తమకు ఏ అకౌంట్‌లో పడిందో కూడా తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఒక బ్యాంకుకు వెళితే ఇక్కడ పడలేదని, ఎక్కడ పడింది అని బ్యాంకు వారిని అడగ తమకు తెలియదంటూ సమాధానం ఇచ్చారని పెన్షన్‌ దారులు వాపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా బ్యాంకుల వద్ద నిరీక్షణ చేశారు. ఇదిలా ఉంటే పెన్షన్‌ దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ డబ్బులను జమ చేయలేదు. కేవలం కొందరికి మాత్రమే జమ చేశారు. అకౌంట్‌లలో జమ కాని పెన్షన్‌ దారులు బ్యాంకుల వద్దకు వెళ్లి నిరాశ చెందారు. రిబ్యాంకుల వద్ద వద్దుల కష్టాలు దువ్వూరు : మండలంలోని పింఛన్‌ దారులకు పూర్తి స్థాయిలో పింఛన్లు అందడం లేదు. కొంతమందికి మాత్రమే బ్యాంకులో జమయింది. మరికొందరికి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్‌ ఇస్తారని బ్యాంకు అధికారులు సమాధానమిస్తున్నారు. మరికొందరికి ‘మీ ఖాతాలో నగదు జమ అయింది.. ఖాతా హోల్డ్‌లో ఉంది.. రేపు రండి’ అని సిబ్బంది చెబుతున్నారు. మండే ఎండలో వ్యవయ ప్రయాసాలకోర్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే అధికారులు రేపు రండి అనడం ఏమిటని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయానికి వెళ్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి చెక్‌ చేసుకోండి సిబ్బంది చెబుతున్నారు. తీరా బ్యాంకుకు వెళ్లి చెక్‌ చేసుకుంటూ మీ ఖాతాలో డబ్బులు పడలేదని అధికారులు చెప్పడంతో ఏమి చేయలేని స్థితిలో పింఛన్‌దారులు అయోమయ స్థితిలో ఉన్నారు. ఉదయం నుంచి బ్యాంకు వద్ద పడిగాలపు పెన్షన్‌ డబ్బుల కోసం ఉదయం నుంచి బ్యాంకు వద్ద వేచి ఉన్నాను. మధ్యాహ్నం ఒకటిన్నర అయినా కూడా నాకు పెన్షన్‌ డబ్బులు రాలేదు. బ్యాంకు దగ్గర రద్దీగా ఉన్నారు. ఇంటిదగ్గర పెన్షన్‌ ఇస్తే బాగుంటుంది.- లక్ష్మమ్మ, వృద్ధురాలు, మైదుకూరు.పెన్షన్‌ డబ్బులు ఎక్కడ పడ్డాయో తెలియదు నా పెన్షన్‌ డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయో తెలియదు. నాకు బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేదు. నేనిప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు. సచివాలయం వద్దకు వెళ్తే ఒక చీటీలో ఏదో రాయించారు. నేను చాపాడు మండలం నుంచి మైదుకూరు స్టేట్‌ బ్యాంక్‌ కు వచ్చాను. – రహంతూ సహబ్‌, అన్నవరం, చాపాడు ఏడి’పింఛన్‌’..(మొదటిపేజీ తరువాయి) వారికి నేరుగా ఇంటివద్దకు వచ్చి సచివాలయం ఉద్యోగులు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త చిక్కు ఏమిటంటే అకౌంట్‌లో పింఛన్‌ డబ్బులు వేయడం వల్ల వద్ధులు, వికలాంగులు, వితంతువులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు పింఛన్‌ డబ్బుల కోసం పట్టణంలోని బ్యాంకుల వద్దకు ఆటోలు, బస్సులలో ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. సరాసరి రూ. 50 నుంచి రూ. 100 ఇచ్చి పోగొట్టు కుంటున్నారు. గ్రామాలలో రూ. వెయ్యి, రూ.10 చొప్పున రూ.30 కమీషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. గత నెల మాదిరే పింఛన్‌ ఇంటి వద్ద వచ్చి ఇస్తే ఈ కష్టలు పడేవారం కామని పింఛన్‌దారులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద కనీసం కూర్చోవడానికి స్థలం లేక ఎండకు రోడ్డు వెంబడి నీడ ఉన్నచోట తలదాచుకున్న పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల అయినా సచివాలయం వద్దనే పింఛన్‌ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. . మైదుకూరు : సామాజిక భద్రత పెన్షన్ల దారులకు మే నెల పెన్షన్‌ డబ్బులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ంనేరుగా పెన్షన్‌ దారుల అకౌంట్లకు జమ చేసింది. మైదుకూరు పట్టణంలో గురువారం కూడా బ్యాంకుల వద్ద పెన్షన్‌ దారులు డబ్బుల కోసం పడిగాపులు కాశారు. తమకు ఏ అకౌంట్‌లో పడిందో కూడా తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఒక బ్యాంకుకు వెళితే ఇక్కడ పడలేదని, ఎక్కడ పడింది అని బ్యాంకు వారిని అడగ తమకు తెలియదంటూ సమాధానం ఇచ్చారని పెన్షన్‌ దారులు వాపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా బ్యాంకుల వద్ద నిరీక్షణ చేశారు. ఇదిలా ఉంటే పెన్షన్‌ దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ డబ్బులను జమ చేయలేదు. కేవలం కొందరికి మాత్రమే జమ చేశారు. అకౌంట్‌లలో జమ కాని పెన్షన్‌ దారులు బ్యాంకుల వద్దకు వెళ్లి నిరాశ చెందారు. దువ్వూరు : మండలంలోని పింఛన్‌ దారులకు పూర్తి స్థాయిలో పింఛన్లు అందడం లేదు. కొంతమందికి మాత్రమే బ్యాంకులో జమయింది. మరికొందరికి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్‌ ఇస్తారని బ్యాంకు అధికారులు సమాధానమిస్తున్నారు. మరికొందరికి ‘మీ ఖాతాలో నగదు జమ అయింది.. ఖాతా హోల్డ్‌లో ఉంది.. రేపు రండి’ అని సిబ్బంది చెబుతున్నారు. మండే ఎండలో వ్యవయ ప్రయాసాలకోర్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే అధికారులు రేపు రండి అనడం ఏమిటని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయానికి వెళ్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి చెక్‌ చేసుకోండి సిబ్బంది చెబుతున్నారు. తీరా బ్యాంకుకు వెళ్లి చెక్‌ చేసుకుంటూ మీ ఖాతాలో డబ్బులు పడలేదని అధికారులు చెప్పడంతో ఏమి చేయలేని స్థితిలో పింఛన్‌దారులు అయోమయ స్థితిలో ఉన్నారు. పెన్షన్‌ డబ్బులు ఎక్కడ పడ్డాయో తెలియదు నా పెన్షన్‌ డబ్బులు ఏ బ్యాం కులో పడ్డాయో తెలియదు. నాకు బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేదు. నేనిప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు. సచివాలయం వద్దకు వెళ్తే ఒక చీటీలో ఏదో రాయించారు. నేను చాపాడు మండలం నుంచి మైదుకూరు స్టేట్‌ బ్యాంక్‌ కు వచ్చాను. – రహంతూ సహబ్‌, అన్నవరం, చాపాడు

➡️