అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత అదితి గజపతిరాజు

May 4,2024 21:25

ప్రజాశక్తి-విజయనగరం కోట : అభివృద్ధి సంక్షేమం సమానంగా చేస్తామని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం 4,5 డివిజన్లలో బాబామెట్ట, గాంధీ పార్క్‌ ఏరియాలోనూ, మండలంలోని పినవేమలి, రాకోడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గపతిరాజు, టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రచారంలో చేశారు. రౌడీరాజ్యం పోయి శాంతిభద్రతలు బాగుండాలంటే టిడిపిని గెలించాల న్నారు. అన్ని అనుమతులతో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ వైసిపి ప్రభుత్వం విజయనగరం నుంచి తరలించేశారని తెలిపారు. 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు అవనాపు విజరు, పిల్లా విజరుకుమార్‌, గాడు అప్పారావు తెలుగుదేశం,జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.టిడిపిలోకి భారీ చేరికలు 46వ డివిజన్‌లో వైసిపికి చెందిన దొంతల గణేష్‌, మజ్జి జగన్‌, బొత్స పైడిరాజు, చందక చిన్నం నాయుడుతో పాటు 300 కుటుంబాలు , 47వ డివిజన్‌ వైసిపికి చెందిన మల్లివరపు మురళీ, మద్దిల రాజేష్‌, బవిరి మహేష్‌, అక్కివరపు బంగారురాజుతో పాటు వంద కుటుంబాలు, గాజులరేగకు చెందిన వైసిపి నాయకులు ఏనుగుల సత్యనారాయణ (సత్తిబాబు), సైలాడ అప్పలనాయడు, ధవళ ఎల్లారావు తదితర కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. వీరిని పార్టీలోకి టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆహ్వానించారు.

➡️