మున్సిపల్‌ కమిషనర్‌గా ఆదితి సింగ్‌ బాధ్యతలు స్వీకరణ

Jan 30,2024 15:32 #Tirupati district

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : అందరి సహకారంతో తిరుపతిని అభివృద్ధి చేస్తానని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదితి సింగ్‌ తెలిపారు. తిరుపతి యాత్ర స్థలం కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారని, వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు ఈ వేసవిలో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్‌ బాధ్యతలు చేపట్టడంతో మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కార్పొరేటర్‌ ఎస్కె బాబు,నరసింహ చారి, డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర రెడ్డి, ఇంజనీరింగ్‌ సూపర్డెంట్‌ టీ మోహన్‌ ఇతర శాఖల అధికారులు కమిషనర్‌ అభినందనలు తెలియజేశారు

➡️