అల్లూరి పోరాటాలు స్ఫూర్తిదాయకం

May 8,2024 00:39

ప్రజాశక్తి-గుంటూరు : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాలు దేశవ్యాప్తంగా విప్లవ ఉద్యమానికి బాటలు వేశాయని, ఆయన త్యాగాలు, విప్లవ పోరాటాలు వర్తమాన, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పిడిఎం) జిల్లా కన్వీనర్‌ డి.సుధాకర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా స్థానిక నాజ్‌ సెంటర్‌ కూడలిలోని సీతారామరాజు విగ్రహానికి పిడిఎం ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధాకర్‌ మాట్లాడుతూ నాటి బ్రిటిష్‌ పాలనను మరిపించే విధంగా బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని విస్మరించారు. ఈ విధానాలను ప్రశ్నించిన అడవి బిడ్డలను పోలీసు బలగాలతో క్రూరంగా చంపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు టి.నరసింహారావు, ఎస్‌.మాల్యాద్రి, టెన్నిస్‌రారు, ఎస్‌.సురేష్‌, ఏసుబాబు, వి.ముత్తయ్య పాల్గొన్నారు.

➡️