ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు

ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి- పెదబయలు : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సిఆర్పిఎఫ్‌ 198 బెటాలియన్‌ ఆధ్వర్యంలో శనివారం వాలీబాల్‌ టోర్నమెంట్‌ ను నిర్వహించారు. ఈ వాలీబాల్‌ టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొనగా రన్నర్‌గా మంగబంద, విన్నర్‌ గా అలమగూడెం జట్లు గెలుపొందాయి. గెలుపొందిన జట్లకు వాలీబాల్‌ కిట్లతో పాటు, టీ షర్టులు, ట్రోపీలను సిఆర్పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చర్యన్‌ రాజు చేతుల మీదుగా అందజేశారు. సిఆర్పిఎఫ్‌ 198 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చర్యాన్‌ రాజు మాట్లాడుతూ.. సివిక్‌ యాక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా వాలీబాల్‌ టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గిరిజన క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పోటీలు దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మనోజ్‌ కుమార్‌, పర్రెడ సర్పంచ్‌ రవిశంకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️