ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది

ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్‌ జానకమ్మ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించి ఓటు ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటు సామాన్యుల పాలిట వజ్రా యుధమన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. డిసెంబర్‌ 9 వరకు ఓటు నమోదుకు చివరి తేదీ అని, అర్హత కలిగిన వారంతా నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఏఓ చంద్రశేఖర్‌, ఈవో పిఆర్‌డి భానుజీరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొండబాబు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️