జిల్లాలో 278 సెల్‌ టవర్లు ఏర్పాటు

Jan 26,2024 00:04
హాజరైన కలెక్టర్‌, ఎమ్మెల్యే,తదితరులు

ప్రజాశక్తి-పాడేరు:మారుమూల గిరిజన గ్రామాలకు నెట్‌ వర్క్‌ సదుపాయాలు కల్పించేందుకు గాను పాడేరు మండలం సలుగు పంచాయతి ఈదులపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విదానంలో జిల్లాలో 278 సెల్‌ టవర్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత జూన్‌ నెలలో 100 సెల్‌ టవర్లను ప్రారంభించామని, ఇప్పుడు మరో 278 సెల్‌ టవర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, గిరిజన గ్రామాలకు సెల్‌ టవర్లు ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. స్థానిక శాసన సభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక అభిమానంతోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. సెల్‌ టవర్లు ఏర్పాటుపై సంతోషాన్ని వ్యక్త పరిచిన ఓ చిట్టమ్మ ముఖ్యమంత్రితో వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ, ప్రతి చిన్న అవసరానికి సిగల్‌ కోసం ఎత్తైన కొండలపైకి వెళ్లి ఫోన్‌ చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు తమ గ్రామం చుట్టూ నాలుగు సెల్‌ టవర్లు రావడంపై సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా, సబ్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి, సలుగు సర్పంచ్‌ గెమ్మెలి అప్పలకొండ, ఎంపీటీసీ దూసూరు మీనా, దేవాపురం సర్పంచ్‌ కిల్లు పరమేశ్వరి, వంటల మామిడి సర్పంచ్‌ పాంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ:మండలంలోని లైగండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎయిర్టెల్‌ సెల్‌ టవర్‌ ను ముఖ్యమంత్రి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ప్రతి ఇంటికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడానికి ముందడుగు వేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శంగా అందించడానికి మొబైల్‌ నెట్వర్క్‌ కనెక్టివిటీ సౌకర్యాన్ని కల్పిస్తుంన్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జె.సుభద్ర మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తిక్‌, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్‌, తహశీల్దారు నాగమ్మ, గిరిజన సంక్షేమ శాఖ ఏఈఈలు అభిషేక్‌, ధ్రువ, ఎంపిడిఓ బి.ఉషారాణి, ఎం.పి.పి. ఈశ్వరి, జడ్పిటిసిలు జానకమ్మ, అర్‌.మత్స్యలింగం, సర్పంచ్‌ శాంతి, తదితరులు పాల్గొన్నారు.

➡️