టిడిపి పథకాలపై ముమ్మర ప్రచారం

ప్రచారం చేపడుతున్న నియోజకవర్గ ఇన్చార్జి ఈశ్వరి

ప్రజాశక్తి- చింతపల్లి : బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా తెలుగుదేశం పార్టీ తీసుకు వచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఆ పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్‌, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి అవగాహన కల్పించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తాజంగిలో పాడేరు నియోజకవర్గం పరిశీలకులు రాజమండ్రి నారాయణతో కలిసి ప్రచారం చేపట్టారు. భవిష్యత్‌ గ్యారంటీ కార్డులను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆండ్రాబు లక్ష్మణ్‌, నాయకులు పరమేశ్వరరావు, గోసరెడ్డి సోమేశ్వరరావు, పురుషోత్తం, సుందరరావు పాల్గొన్నారు.

➡️