పార్టీ కేటాయించిన అభ్యర్థి గెలుపునకు కృషి

Feb 1,2024 00:23
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

ప్రజాశక్తి- పెదబయలు: వైస్సార్సీపీ అల్లూరి జిల్లా నూతన అధ్యక్షులు, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పదవి చేపట్టిన నాటి నుండి మొదటిసారిగా మండల కేంద్రానికి విచ్చేసారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఫాల్గుణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలను శిరసా వహిస్తానని తెలిపారు. అరకు పార్టీ సమానవ్యయ కర్తగా ఎవరికీ కేటాయించినా క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలుపునకు తన కేడర్‌తో పని చేసి తానేంటో నిరూపించుకుంటానన్నారు సమావేశాలు గ్రామ స్థాయ్టినుండి మండల స్థాయి వరకు ఇప్పటికే కేడర్‌ను సంసిద్దాం చేశానన్నారు. తనకు టికెట్‌ కేటాయించ లేదని అభిమానులు నిరాశ పడవద్దని, పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీని నమ్మిన వారికి మొండిచేయి చూపించరన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, మండల అధ్యక్షులు వి.ఆనందరావు, మాజీ జడ్పీటీసీ కొంటా సూర్యనారాయణ, మండల కన్వీనర్‌ కొర్ర కనకరాజు, సూరయ్య, మండల సర్పచ్‌ల ఫోరమ్‌ మాజీ అధ్యక్షులు పాంగి సింహాచలం పాల్గొన్నారు.

➡️