భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ

ర్యాలీ చేపడుతున్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ఉపాధి కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో అల్లూరి జిల్లా బిల్డింగ్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో (సిఐటియు) తాసిల్దార్‌ కార్యాలయం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ భారీ ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థానికంగా ఉంటూ ప్రభుత్వ టెండర్‌ పనులు, ఇతర భవనాలు నిర్మిస్తూ స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా అందించే సంక్షేమ పథకాలు నిలిపివేశారని, బోర్డులో ఉన్న నిధులన్నీ పక్కదారి పట్టించారన్నారు.క రోనా సమయంలో పనులు లేక కోల్పోయిన కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు రామచందర్‌, శంకర్ల సత్తిబాబు, ప్రేమానంద్‌, సింహాచలం, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️