మధ్యాహ్న, పారిశుధ్య కార్మికుల నిరసన

నినాదాలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు '

 

ప్రజాశక్తి-హుకుంపేట:సమస్యలను పరిష్కరించాలని మండలంలోని మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌, శానిటరీ వర్కర్స్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుండి మెయిన్‌ బజార్‌ మీదుగా ఎం ఈఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి తమార్బ అప్పలకొండ పడాల్‌ మాట్లాడుతూ, కనీసం వేతనం 26 వేలు ఇచ్చి, 9 నెలల పెండింగ్‌ జీతాల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రమాద భీమా, గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, మెరకచింత మాజీ సర్పంచ్‌ వలసనైని లక్ష్మణ్‌ రావు, తడిగిరి వైస్‌ సర్పంచ్‌ కిల్లో రామారావు, మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వంతాల స్వప్న, కార్యదర్శి మర్రి వరలక్ష్మీ, నాయకులు పీ బాబూరావు, పాంగి మత్స్యరాజు, కొర్ర సోమరన్న పాల్గొన్నారు. సమస్యలపై ‘మధ్యాహ్న’కార్మికుల వినతిప్రజాశక్తి-చింతపల్లి:మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వక పోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు సంక్రాంతి పండగ ఎలా చేసుకుంటారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయర్య పడాల్‌ ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్న భోజనం కార్మికులతో కలిసి చింతపల్లి డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందించారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలల నుండి వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇచ్చే తక్కువ వేతనాలకు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే బకాయి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు పసుపులేటి లక్ష్మి, మండల అధ్యక్షులు పద్మ, జ్యోతి, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

➡️