వైసిపి నేతల నిరసన

వైసిపి నేతల నిరసన

ఎంపి మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నుండి ఎంపీ మాధవి అరకు వైపు వెళ్తున్న సమయంలో వైసీపీ నాయకులు, జెడ్పిటిసి సర్పంచులు, ఎంపీటీసీలు రోడ్డుపై ఎంపి కాన్వారును అడ్డుకున్నారు. నాన్‌ లోకల్‌ వద్దు లోకల్‌ ముద్దు ఎంపీ గో బ్యాక్‌ అంటూ శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంతోమంది ఆశావహులు ఉండగా పాడేరు నియోజకవర్గం నుంచి ఎంపీని ఎమ్మెల్యేగా అధిష్టానం ప్రకటించడం తీవ్ర అన్యాయమన్నారు. అధిష్టానం పునరాలోచన చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో అరకు నియోజకవర్గంలో వైసిపికి ఓటమి ఖాయమన్నారు.అరకు నియోజకవర్గంలో ఉన్న నాయకులను అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రేగం మత్య్సలింగం, సర్పంచులు రమేష్‌, సుబ్బారావు, ఎంపీటీసీలు సాంబ, నాయకులు సత్తిబాబు, కోటిబాబు, భూషణ్‌ పాల్గొన్నారు.

➡️