29వ రోజుకు అంగన్వాడిల సమ్మె

సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారానికి 29 వ రోజుకు చేరుకుంది .ఈ సందర్భంగా మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఏటువంటి బెదిరింపులకు పాల్పడిన వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీ కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, అంగన్వాడి కార్మికులు ,హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.హుకుంపేట: జీవో 2ను వెంటనే రద్దు చేయాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపడుతున్న దీక్ష మంగళవారంతో 29వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్మా చట్టం వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి.అప్పలకొండ పడాల్‌, అంగన్వాడి నాయకులు అప్పలకొండమ్మ, కృష్ణవేణి, పద్మ, కుమారి పాల్గొన్నారు.పెదబయలు:స్థానిక అంబేద్కర్‌ కూడలి వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగింది.ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు రాజమ్మ, పద్మ, మంగ, కొండమ్మ, సుశీల పాల్గొన్నారు.అనంతగిరి:మండలంలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు.ఎస్మా చట్టం ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తే వెనుకాడేది లేదని అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు కళావతి, మంజుల, కె.లక్ష్మీ తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి కె.మొస్య మద్దతు పలికారు.కొనసాగిన నిరసనలువిఆర్‌.పురం : మండలంలోని రేకపల్లి వద్ద సమ్మె ప్రాంగణంలో 29వ రోజు నిరసన కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలంతా ఎర్ర చీరలు ధరించి సిఐటియు, 29 ఆకారంతో కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూనెం సత్యనారాయణ, సున్నం రంగమ్మ, యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, వర్కర్లు పాల్గొన్నారు.చింతూరు : మండల కేంద్రంలో అంగన్వాడీల దీక్షలను యూనియన్‌ కార్యదర్శి నూక రత్నం, అధ్యక్షులు వెంకటరమణ ప్రారంభించారు. అనంతరం స్థానిక ఐటీడీఏ నుండి చింతూరు సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరికి సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సీసం సురేష్‌, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, సిఐటియూ నాయకులు పోడియం లక్ష్మణ్‌, తేపలా లక్ష్మయ్య, వివిధ సంఘాల నాయకులు సురేష్‌, కామేశ్వరి, జయ, కన్నకదుర్గ, చిట్టమ్మ, చుక్కమ్మ, సత్యవతి, విజయకుమారి, భద్రమ్మ, దుర్గ పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండల కేంద్రంలో అంగన్వాడీలు 29వ రోజు ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గడుదురు సత్యనారాయణ, యూనియన్‌ నాయకులు పోతురాజు కృష్ణకుమారి, సోమేలి, అప్పలనర్స, ఎల్‌.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

➡️