ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

alluri anganwadi protest 2nd day

ప్రజాశక్తి-పెదబయలు : రాష్ట్ర ప్రభుత్వ మేని పేస్టో స్టలో అంగన్వాడీ అండ్ హెల్పర్స్ లకు ఇచ్చిన హామీలు తక్షణమే పరిష్కరించాలని డా బి ఆర్ అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మండు టెండలో చంటి పిల్లలను చెంకలో పెట్టుకొని సుమారు 400 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెలఫర్స్ డిమాండ్ల సాధనకు రెండవ రోజు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు అల్లూరి జిల్లా గిరిజన సంఘం సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అంగన్వాడీ హెలఫర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు టి రాజమ్మ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈసమ్మె కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మన్న పడల్ ముఖ్య అతిధిగా హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అంగన్వాడీ లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు పరచాలని తెలంగాణ రాష్ట్రము అంగన్వాడీ లకు ఇచ్చే వేతనం కన్నా అతి తక్కువ చెల్లిస్తూ పనిభారం ఒత్తిడి తెస్తున్నారని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతన్సమ్ 26 వేలకు పెంచి చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని విధులలో ఉంటూ లేదా అనారోగ్యం తో మరణిస్తే ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కుటుంబసభ్యులకు వైద్య సహాయం ఉచింతంగా అందించాలని బకాయిపడ్డ ఇంటి అద్దె చెల్లించాలని రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్ ఫర్స్ డిమాండ్స్ పరిష్కరించాపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట మరువను మండపతిప్పను ఒట్టి కబుర్లేనా వట్టిమాటలు మూతగట్టి అంగన్వాడీ లకు ఇచ్చిన హామీ తక్షణమే నెరవెర్చాలన్నారు. మధ్యాహ్నం నడిరోడ్డుపై వంటవార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల మహిళా అధ్యక్షురాలు టి కౌసల్య సిపిఎం గిరిజన సంఘం నాయకులు కె శరబన్న అంగన్వాడీ నాయకురాలు సిహెచ్ పద్మ లొట్టి మంగ సుశీలనిక్కుల రూప అధికసంఖ్యలో అంగన్వాడీ వర్కర్స్ హెలఫర్స్ పాల్గొన్నారు

➡️