అంగన్వాడీల రాస్తారోకో, మానవహారం

anganwadi workers strike 20th day rgvg

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ఆదివారం రాజవొమ్మంగిలో స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలిత అంగన్వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం అంగన్వాడీల సమ్మె 20వ రోజు కొనసాగించారు. కార్మిక సంఘ గీతాలకు అంగన్వాడీలు రహదారిపై లయబద్ధంగా కోలాటం, దింశా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి, అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి నిరీక్షించిన గ్రామస్తులు విసుకు చెందకుండా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు కె వెంకటలక్ష్మి, సిహెచ్ కుమారి,సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు,సీపీఎం నాయకులు జర్తా రాజు లు మాట్లాడుతూ, 2019 ఎన్నికల సమయంలో పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చమని, తెలంగాణలో కన్నా అదనంగా వెయ్యి రూపాయల ఇస్తామని చేసిన హామీలు నెరవేర్చమంటే సమ్మెలో ఉండగా దౌర్జన్యంగా అంగనవాడిలపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు,అక్రమ అరెస్టులను, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అంగన్వాడీలపై దాడులును పిరికి బంధ చర్యగా అభివర్ణించారు, కనీస వేతనం అమలు చేయాలని,తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాట తప్పకుండా నిలబెట్టుకోవాలన్నారు. పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి, నూకరత్నం, కె లక్ష్మి, చిన్నమ్మలు, రమణి, రమణ, రత్నం, రాజేశ్వరి, మంగ, రాధ, ఎర్రయ్యమ్మ పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️