భయపడే ఎస్మా ప్రయోగం 

anganwadi workers strike 28th day alluri

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యల పరిష్కారానికై చట్టబద్ధంగా అంగన్వాడీల పోరాటానికి భయపడే ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి జీఓ2 తీసుకొచ్చిందని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్ అన్నారు, తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్లు అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 28వ రోజు కొనసాగింది, సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీల సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి కిరణ్, గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షలు లోతా రామారావు, తదితరులు సంఘీభావం తెలిపారు,అంగన్వాడీలు నల్ల చీరలు ధరించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టం జీఓ ప్రతులను స్థానిక అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు,ఈ సందర్భంగా సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందన్నారు, గత 28 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ ఆడపడుచుల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించేందుకు ఎస్మా చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందని,తక్షణమే ఎస్మాని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు, చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలతో 5 దఫాలు నిర్వహించిన చర్చలు తూతూమంత్రంగానే సాగాయన్నారు,సమస్యకు పరిష్కారం చూపకుండా వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడమంటే వారి ఉద్యమానికి జగన్‌ సర్కార్‌ భయపడుతుందని అర్థం అవుతుందన్నారు,గతంలో ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని,ఆ జాబితాలోకి వైసిపి వెళ్లబో తుందని పేర్కొన్నారు, మహిళా సాధికారత గురించి ప్రగల్బాలు పలుకుతున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీలు మహిళలు అనే విషయాన్ని మరచిపోయి వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తన ఖఠినత్వాన్ని చాటుకుంటుం దని దుయ్యబట్టారు, తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.18 వేలకు పెంపుదల చేసిందని,ఇది చూసైనా జగన్‌ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు, అంగన్‌వాడీలకు మద్దతుగా ఈ నెల 9న జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయని, పట్టుదలతో పోరాడుతున్న అంగన్‌వాడీలకు కేంద్ర కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు అండగా నిలిచినందుకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కుమారి,కె వెంకటలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు,తమ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు,ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం,సిఐటియు, డివైఎఫ్ఐ,ప్రజా సంఘాల నాయకులు,కె జగన్నాథం,కె సూరిబాబు,పి రామరాజు,టి శ్రీను,పి పాపారావు,పి సత్యనారాయణ,పి రాంబాబు,అంగన్వాడి యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి,నూకరత్నం,కె లక్ష్మీ,చిన్నమ్ములు,రమణి, రమణ,రత్నం,రాజేశ్వరి, మంగ,రాధ,భవాని పెద్దసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️