వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

May 27,2024 12:42 #anakapalle district

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట(అనకాపల్లి జిల్లా) : మండల కేంద్రం బుచ్చయ్యపేటలో సోమవారం కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సర్కిల్ లోని బుచ్చయ్యపేట ఎస్సై ఈశ్వరరావు, రావికమతం ఎస్సై ధనుంజయ నాయుడు, కొత్తకోట ఎస్సై లక్ష్మణరావు రోలుగుంట ఎస్సై సురేష్ లు బుచ్చయ్యపేట గ్రామంలో తెల్లవారుజాము నుండి కార్బన్ అండ్ సెర్చ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. గ్రామంలోని సరైన పత్రాలు లేనటువంటి 58 ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలు సీజ్ చేసి దర్యాప్తు చేస్తన్నట్లు ఎస్ ఐ డి ఈశ్వరరావు తెలిపారు.

➡️