లబ్ధిదారులకు సేవలు ఎలా..?

anganwadi workers strike 32nd day in alluri

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పుష్ప అధ్యక్షత వహించింది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం నాగమణి, టిడిపి మండల నాయకులు సున్నం నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పోతురాజు, మండల నాయకులు తగరం బాబురావు, సిపిఐ మండల కార్యదర్శి కారం దారయ్య మాట్లాడుతూ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించి ఈరోజుకి 32 రోజులు కావస్తుంది. అంగన్వాడీలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పైగా పిల్లలు, గర్భిణీలకు  సేవలందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు పొందుతున్న లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బలహీనవర్గాలు అసంఘటిత కార్మిక, పేద, రైతు, వ్యవసాయ కార్మిక, తదితర చెందినవారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం పెంచాలని. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని కోరుతూ సమ్మె గత 27 రోజులుగా నిర్వహిస్తున్నారు. వీరికి న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా దుర్మార్గంగా ఎస్మా ప్రయోగించింది. అంతకుముందే సెంటర్ తాళాలను పగలగొట్టడం. జనవరి 5లోగా విధులకు హాజరు కాకుంటే తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడింది. అయినా అంగన్వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. జనవరి 8వ తేదీ లోగా డ్యూటీలో చేరాలని అంగన్వాడీలకు డెడ్లైన్ విధించి బెదిరించడం చాలా దుర్మార్గం. సమస్యలను సంబంధిత సంఘాలతో చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. అంగన్వాడి న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి లోగా పరిష్కరించాలని, లేనియెడల రాజకీయ పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తెలియజేస్తుంది. ఈ సమావేశంలో అంగన్వాడి యూనియన్ మండల నాయకులు రామలక్ష్మి, కృపామణి,ఐఎఫ్ టి యు నాయకులు మారమ్మ, ఆకాశమ్మ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామ ముత్యాలమ్మ, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి వినోద్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శ్రీనివాస్, ఏపీటీఎఫ్ నాయకులు శ్రీను, యుటిఎఫ్ నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొన్నారు.

➡️