స్ట్రాంగ్‌ రూములపై నిరంతర పర్యవేక్షణ

స్ట్రాంగ్‌ రూమును పరిశీలిస్తున్న కలెక్టర్‌, జెసి, పిఒ

ప్రజాశక్తి-పాడేరు:స్థానిక డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత, జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిస్ట్‌, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌, అడిషనల్‌ ఎస్పీ ధీరజ్‌లు పరిశీలించారు. ప్రతిరోజు స్ట్రాంగ్‌ రూములో తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లాగ్‌ బుక్‌ లో అధికారులంతా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డివిఆర్‌ ఎం.రాజు, డిఈ అనుదీప్‌, సిఐ నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️