సిపిఎం పోరాటంతో తాగునీరు సరఫరా

నీటిని పట్టుకుంటున్న గ్రామస్తులు

ప్రజాశక్తి -అనంతగిరి: తాగునీటి సమస్యను సిపిఎం ఆధ్వర్యన గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టడంతో అధికారుల స్పందించి మరమ్మతు పనులు చేపట్టి తాగునీటిని సరఫరా చేశారని ఆ పార్టీ వార్డు మెంబర్‌ సోమ్మెల అప్పలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాన్‌ షెడ్యూల్‌ రొంపల్లి పంచాయతీ పరిధి ఎగువగుడ్డి గ్రామంలో పైపులైన్‌ మరమ్మతు గురై తాగునీటి సరఫరా నిలిచిపోయిందని,దీంతో, బిందెలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టామన్నారు.స్పందించిన అధికారులు మరమ్మతులు పనులు చేపట్టి తాగునీటి సరఫరా చేసారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు కె. సింహాచలం, కొత్తయ్య పాల్గొన్నారు.

➡️