పాత్రికేయుల కార్యవర్గం ఎన్నిక

Apr 16,2024 23:59
ఎన్నికైన కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గిరిజన విలేకరుల సంఘం సీనియర్‌ పాత్రికేయులు కాంతారు మోహన్‌, కూడ మోహన్‌ల అధ్యక్షతన మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంద్రప్రదేశ్‌ గిరిజన విలేకరుల సంఘం (ఎపిటిఆర్‌ఏ) అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా కాంతారు మోహన్‌, అధ్యక్షుడిగా రెయ్యల నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా కూడ మోహన్‌, కోశాధికారిగా పాంగి భాస్కర్‌రావు లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గంపరాయి కోటిబాబు, కిల్లో ఈశ్వర్‌రావు, కూడ అనిల్‌, కిముడు రాంబాబు ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శిలు నాగభూషణం, కూడా మోహన్‌లు మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో విలేకరుల సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

➡️