25న నామినేషన్‌ వేస్తున్నా: అంబటి రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి శాసనసభ అభ్యర్థిగా ఈనెల 25 వ తేదీన &ƒవేయనున్నానని ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి మండలం ఫణిదంలో శుక్రవారం ఆయన పర్యటిం చారు. ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ పంచుమర్తి అప్పారావు, సర్పంచ్‌ వేమ వరపు బుల్లిబాబు, ఎంపీటీసీ సభ్యులు భూపతి, ఫణి దం సొసైటీ చైర్మన్‌ బొడ్డు నాగేశ్వరరావు , పార్టీ క్రియా శీలక నాయకులు కూచిపూడి సైమన్‌ , ముస్లిం నాయ కుడు నబీలను కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత పరిపాలనతో భేరీజు వేసుకొని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను, నరసరావు పేట పార్లమెంట్‌ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను గెలి పించాలని అభ్యర్థించారు. రానున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని, పేద వర్గాల భవిష్యత్తును నిర్ణయించే వన్నారు. కార్య క్రమంలో మండల కన్వీనర్‌ రాయపాటి పురుషోత్తమ రావు, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు చంద్రబాబు మాయమాటలకు మోసపోవద్దు చంద్రబాబు మాయమాటలను, ఉత్తిత్తి హామీలను నమ్మి మోసపోవద్దని అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి మండల గర్నెపూడిలో శుక్రవారం రాత్రి వైసిపి అభ్యర్థి మంత్రి అంబటి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.

➡️