ప్లాస్టిక్ వినియోగం వల్ల అనర్థాలపై అవగాహన ర్యాలీ

Mar 3,2024 16:34 #Kakinada

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : మహారాణి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ – 5 ప్రోగ్రాం ఆఫీసర్ మేడిశెట్టి తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా ఆదివారం 3 వ రోజు కాలనీవాసులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.అనంతరం ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే పర్యావరణ అనర్ధాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు.అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రాజీవ్ కాలనీ,ఎన్టీఆర్ కాలనీలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాలలో పాల్గొని ఇంటింటికి తిరిగి 225 మంది బాలలకు పోలియో చుక్కలు వేశారు.

➡️