రైలు నుండి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jun 16,2024 16:32 #boy death, #Eluru district

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : రైలు నుండి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు నగరంలోని ఆశ్రమ ఆసుపత్రి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలోని ఆశ్రమం ఆసుపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని 42-45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి జారిపడి మృతి చెందాడు. ఇతని ఎత్తు దాదాపు 5 అడుగుల ఐదు అంగుళాలు కోల ముఖం తెలుపు జుట్టు సామాన్య దహదారుడు కలిగి ఉన్నాడు. ఆలివ్ గ్రీన్ రంగు టీ షర్ట్, నలుపు రంగు లోయర్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే ఎస్ఐడి నరసింహారావు తెలిపారు. మృతదేహం ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే పోలీసులు ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.

➡️